కేసీఆర్ జీతం నిలిపివేయండి.. కాంగ్రెస్ ఫిర్యాదు

కేసీఆర్ జీతం నిలిపివేయండి.. కాంగ్రెస్ ఫిర్యాదు

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్, మార్చి 11: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా జీతభత్యాలు పొందుతూ అసెంబ్లీకి రావడం లేదంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌, అసెంబ్లీ సెక్రటరీకి హస్తం నేతలు ఫిర్యాదు చేస్తూ వినతి పత్రం అందజేశారు. మాజీ సీఎంకు వేతనం నిలిపివేయాలంటూ కాంగ్రెస్ లీడర్లు కోరారు. అలాగే ఇన్ని రోజులు కేసీఆర్‌కు ఇచ్చిన జీతాన్ని కూడా రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. గత 14 నెలల నుంచి ఆయనకు ఇచ్చిన పదవిని సరిగ్గా నిర్వర్తించడం లేదని, ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని.. అందువల్ల ఇన్ని రోజులుగా ఆయనకు ఇచ్చిన జీతాలను రికవరీ చేయాలని హస్తం నేతలు లేఖలో కోరారు. ప్రజల సొమ్మును కేసీఆర్ జీతంగా వాడుకుంటున్న నేపథ్యంలో వేతనాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఆడబిడ్డల జోలికొచ్చారో..

ఇక ఈ విషయంపై బీఆర్‌ఎస్ నేతలు స్పందిస్తూ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనను కించపరిచే అవకాశం ఉందని, హేళన చేసే ఛాన్స్ ఉంది కాబట్టే ఆయన అసెంబ్లీకి రావడం లేదని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ర్యాగింగ్ చేస్తారనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు పదే పదే అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తున్నారనేది బీఆర్‌ఎస్ నేతల మాట. దీనిపై హస్తం నేతలు మాట్లాడుతూ.. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చినా ఆయనను ర్యాగింగ్ చేసే అవకాశం లేదని.. ప్రతిపక్ష నేతగా, పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద ఇస్తామని తెలిపారు. అలాగే కేసీఆర్ ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కొద్దిసేపటి క్రితమే స్పీకర్‌కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం ఇచ్చారు. దీన్ని పరిశీలించాల్సిందిగా అసెంబ్లీ సెక్రటరీకి రికమెండ్ చేస్తూ స్పీకర్‌కు లేఖను పంపించారు.

  • Related Posts

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి13 :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌…

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు . మనోరంజని ప్రతినిధినిర్మల్ జిల్లా – సారంగాపూర్: మార్చి 13 :-నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని వివేకానంద స్కూల్‌లో గురువారం హోలీ పండుగ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పాల్గొన్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి

    మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్సి నవీన్ కుమార్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి