కులగనను ప్రయోజనాలు గొప్పవి

కులగనను ప్రయోజనాలు గొప్పవి

ప్రొఫెసర్ కంచె ఐలయ్య

గాంధీభవన్ లో ఆదివాసి కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం

హాజరైన గిరిజన ఆదివాసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీను నాయక్

గాంధీభవన్ ఇందిరా హాల్లో తెలంగాణ రాష్ట్ర ఆదివాసి కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ఆదివాసి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ట్రై కార్ చైర్మన్ తేజావత్ బిల్లా నాయక్ అధ్యక్షతన జరిగింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన వాటి యొక్క ప్రయోజనాలు అనే అంశంపై ప్రొఫెసర్ కంచ ఐలయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని వివరించడం జరిగింది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బీసీ గణాంకాలు చేసే చేతకాక తెలంగాణ రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతిలో జరిగిన కుల గణన ను ఆమోదింప చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కులగణను విజయవంతంగా అమలు చేస్తే బిజెపి పాలిత రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు ఇలా చేయాలని డిమాండ్ పెరిగి తమపై ఒత్తిడి పెరుగుతుంది అని దుర్దేశంతో ఆర్ఎస్ఎస్ బిజెపి నాగపూర్ కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగలను అడ్డుకోవాలని ప్రయత్నం కుట్రలు చేస్తా ఉన్నారు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులంతా కాంగ్రెస్ పార్టీ బలపరిచి నాయకులుగా తయారవ్వాలని అదేవిధంగా ఆదివాసీ కాంగ్రెస్ అనేవి చేస్తున్నారని మొత్తం పార్టీ యొక్క సారాంశాన్ని పార్టీ యొక్క ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టవలసిన అవసరం ఉందని. ప్రభుత్వాలు చేసేటటువంటి అనేక సంక్షేమ పథకాలను కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుండి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని అన్నారు ఈ సంక్షేమ పథకాలను ప్రజల వరకు చేరుకునే విధంగా ఆదివాసి కాంగ్రెస్ పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఈ లక్ష్యంతో పనిచేస్తుందో ఆ యొక్క లక్ష్యాలను సాధించడానికి సామాన్యమైన ఆదివాసి కార్యకర్తలు నాయకులు ఎదిగే దిశగా ముందుకు సాగాలని పార్టీ అనేక ట్రైనింగ్ క్యాంపులను పెట్టి విద్యావంతుల ద్వారా మేధావుల ద్వారా వారిని నాయకులు తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపి బలరాం నాయక్,ఆదివాసి కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీను నాయక్ , అన్ని జిల్లాల అధ్యక్షులు, ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అదేవిధంగా కుమార్ నాయక్, సంతోష్ నాయక్ వినోద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..

  • Related Posts

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 13 :మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా…

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి13 :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్