కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు – గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎర్రబెల్లి

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు – గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎర్రబెల్లి

మనోరంజని ప్రతినిధి రాయపర్తి మార్చి 29 :- రాయపర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. ముఖ్యంగా రేవంత్ ప్రజా దర్బార్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ఆశ్రఫ్, మాజీ వార్డ్ నెంబర్ భర్త జలగం రవి, ఎండీ అఖిల్, కాస్రబోయిన కుమార్ (కరుణం), ఎండీ కామరోద్దీన్, పోగులకొండ ఎల్లయ్య, చెడుపాక శ్రీకాంత్, గారే అనిల్, గారే వెంకన్న, గారే రమేష్, గుగులోత్ చంద్రు, గుగులోత్ వెంకటేష్ తదితరులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అందరికీ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, స్థానిక నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    బీఆర్‌ఎస్‌ సభకు 3 వేల బస్సులు..

    బీఆర్‌ఎస్‌ సభకు 3 వేల బస్సులు.. ఆర్టీసీకి బస్సుల కోసం రూ.8 కోట్లు చెల్లింపు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో కేటీఆర్‌ భేటీ నేడు గ్రేటర్‌ పరిధిలోని నేతలతో సమావేశం త్వరలో నియోజకవర్గాలకు ప్రచార సామగ్రి రజతోత్సవ సభ ఏర్పాట్లు ముమ్మరం…

    నార్నూర్: ‘విద్యాభివృద్ధిపై దృష్టి సారించాలి’

    నార్నూర్: ‘విద్యాభివృద్ధిపై దృష్టి సారించాలి’ మనోరంజని ప్రతినిధి ఏప్రిల్ 07 – నార్నూర్ మండల కేంద్రంలో సోమవారం ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లాధ్యక్షుడు పెందోర్ సంతోష్ ను సోమవారం బంజారా హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అహ్మదాబాద్‌లో నేటి నుంచి ఏఐసీసీ సమావేశాలు

    అహ్మదాబాద్‌లో నేటి నుంచి ఏఐసీసీ సమావేశాలు

    దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పు

    దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పు

    పెరిగిన గ్యాస్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి

    పెరిగిన గ్యాస్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి

    Indian Navy: పాక్ సిబ్బందికి సహాయం అందించిన ఇండియన్ నేవీ సిబ్బంది

    Indian Navy: పాక్ సిబ్బందికి సహాయం అందించిన ఇండియన్ నేవీ సిబ్బంది