కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది :

కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది :

రైతు వేదిక భవన కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ – షాది ముభారక్ చెక్కుల పంపిణీ :

ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ :

మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 11 :- దస్తురాబాద్ : రాష్ట్రంలోని కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని,కళాశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో 30 కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేశారు.తదనంతరం కేజీబివి కళాశాలలో 2కోట్ల 30లక్షల వ్యయంతో నిర్మించనున్న భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు.కళాశాలల అభివృద్దికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని అన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు.పేదరికాన్ని నిర్మూలించే ఏకైక ఆయుధం చదువు అని ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.పేదలకు మేలు చేకూరేలా ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఆర్ధికంగా ఎంతో చేయూతను అందిస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళలు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు మనోరంజని ప్రతినిధి మార్చి 15 – గ్రామ ప్రజలంతా సహజ సిద్ధమైన రంగులతో ఆనందంగా హోలీ పండగ జరుపుకోవాలని కోరుకుంటూ ఈ హోలీ పండుగ మన జీవితాల్లో కొత్త రంగులు నింపాలని, అందరూ…

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 15 – మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి సభకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    న్యూస్ హెడ్ లైన్స్

    న్యూస్ హెడ్ లైన్స్

    15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు