

ఆదిలాబాద్ పట్టణంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల యొక్క భవనం నిర్మాణానికైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవార్ శంకర్ రెండు కోట్ల రూపాయల బిల్లును మంజూరు చేసేందుకు అధికారిక అనుకూలతను చూపినందుకు ఫిర్యాదుదారుడి నుండి మొదటగా రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు దానిని ఒక లక్ష రూపాయలకు తగ్గించి, మొదటి విడతగా రూ.50,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన ఆదిలాబాద్ పట్టణంలోని విద్యా & సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవర్ శంకర్. ఏసీబీ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించడంతో అవినీతి అధికారుల్లో భయం నెలకొంది. లంచం అడిగితే 1064కు డయల్ చేయండి