

ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న పరీక్షలు
హాజరుకానున్న 6,49,884 మంది విద్యార్థులు
ఉదయం 9:30 గంటల నుంచి 12:45 వరకు పరీక్ష
పరీక్షరాసే విద్యార్థులకు RTC బస్సుల్లో ఉచితప్రయాణం
ఏపీలో మండుతున్న ఎండలు
కోస్తాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు నేడు ఏపీలోని 34 మండలాలకు రెడ్ అలర్ట్
మరో 171 మండలాలకు ఎల్లో అలర్ట్ జారీ నేడు 202 మండలాల్లో వడగాలులు ఉంటాయని..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.
టెన్త్ విద్యార్థులకు సీఎం చంద్రబాబు విషెస్ పరీక్షలు రాస్తున్న యంగ్ ఫ్రెండ్స్‌కు ఆల్ ది బెస్ట్
కష్టపడి చదివి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని..
సీఎం చంద్రబాబు ట్వీట్.
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారాలోకేష్.పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నా.సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోండి..సమయాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలు పూర్తి చేయండి : మంత్రి నారా లోకేష్.
అమరావతి: నేడు ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భేటీ
అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చించే అవకాశం
నేడు ఏపీ అసెంబ్లీలో పీ4 విధానం, సంక్షేమంపై చర్చ ఆయుర్వేద, హోమియోపతి వైద్య వృత్తిదారుల నమోదుపై..సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి సత్యకుమార్ నేడు ఏపీ శాసనమండలిలో ఉద్యోగుల సమస్యలపై చర్చ భూహక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల..సవరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టనున్న అనగాని.
ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్స్ పార్లమెంట్ క్యాంటీన్‌లో నేటి నుంచి స్టాల్స్
2 స్టాళ్లను ఏర్పాటు చేయనున్న గిరిజన సహకార సంస్థ.
రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు 19వ తేదీ ప్రధాని మోదీతో భేటీకానున్న చంద్రబాబు రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు..మోదీని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు
అమరావతి:ఉండవల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పొట్టిశ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం.
చెన్నై: అపోలో ఆస్పత్రి నుంచి AR రెహమాన్ డిశ్చార్జ్. ఏఆర్ రెహమాన్ హెల్త్ బులెటిన్ విడుదల డీహైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరినట్టు వైద్యులవెల్లడి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సఅందించిన వైద్యులు
నేడు తెలంగాణ అసెంబ్లీలో 2 చరిత్రాత్మక బిల్లులు బీసీలకు విద్య, ఉద్యోగాలు,రాజకీయాల్లో..రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లు
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఇప్పటికే బిల్లులకు ఆమోదం తెలిపిన కేబినెట్
బీసీ ఎమ్మెల్యేలతో భేటీకానున్న మంత్రి పొన్నం
తెలంగాణలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు 2 రోజుల్లో 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం నేడు ఆదిలాబాద్‌లో 40.3 డిగ్రీలు నమోదయ్యే అవకాశం సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం
హైదరాబాద్‌లో పాత కరెన్సీ నోట్ల కలకలం రద్దయిన నోట్లను మార్చేందుకు నిందితుల యత్నం
ముఠాను అరెస్ట్ చేసిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ రూ.55.52 లక్షల పాత కరెన్సీ నోట్లు స్వాధీనం ప్రధాన నిందితుడు హుస్సేన్ సహా అంజద్‌ఖాన్..భాస్కర్, షేక్ నజీమాను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: నటుడు విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ రూ.2 లక్షల విలువైన డైమండ్ రింగ్ అపహరణ పోలీసులకు ఫిర్యాదు చేసిన విశ్వక్ సేన్ తండ్రి రాజు గేట్ ఎదుట గుర్తుతెలియని వ్యక్తి బైక్ గుర్తింపు తెల్లవారుజామున చోరీ జరిగినట్టు అనుమానం.
తిరుపతి : వెటర్నరీ యూనివర్సిటీ వద్ద చిరుతపులి కలకలం.అటవీ అధికారులకు సమాచారమిచ్చిన సెక్యూరిటీ సిబ్బంది.
తిరుమలలో ఘరానా మోసం.. టీటీడీ చైర్మన్ జనరల్ సెక్రటరీ పేరుతో భక్తురాలికి టోకరా.
వీఐపీ బ్రేక్ దర్శనం, సుప్రభాత సేవా టికెట్లు ఇస్తానని రూ.2.6 లక్షలు స్వాహా.తిరుమల పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు. నిందితులు మదల దీపు బాబు, పవర్ కుమార్ గా గుర్తింపు.. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.
చిత్తూరు : పుంగనూరు మండలం కృష్ణాపురం వద్ద ఉద్రిక్తత.హత్యకు గురైన టీడీపీ కార్యకర్త అంత్యక్రియలకు అంగీకరించని కుటుంబ సభ్యులు.హత్యకు కారకులను అరెస్ట్ చేయాలని మృతుడి బంధువుల డిమాండ్.మృతుడి కుటుంబసభ్యులకు నచ్చజెబుతున్న పోలీసులు.
టీడీపీ కార్యకర్త రామకృష్ణ కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ.రామకృష్ణ కుటుంబసభ్యులను ఫోన్‍లో పరామర్శించిన చంద్రబాబు.రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామన్న సీఎం.. నిన్న పుంగనూరులో వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన రామకృష్ణ.టీడీపీ కార్యకర్త హత్యకు గురికావడం నన్ను తీవ్రంగా బాధించింది..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం చంద్రబాబు.
తూ.గో : గోపాలపురంలో డయేరియా కలకలం. గోపాలపురం PHCకి చికిత్స కోసం వస్తున్న డయేరియా పేషెంట్లు.గత మూడు రోజులుగా 25 మందికి సోకిన డయేరియా.
సీఎం చంద్రబాబు సమక్షంలో హడ్కో-సీఆర్డీఏ మధ్య ఒప్పందం.కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్.ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11 వేల కోట్ల రుణం.
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.CRDA ఆమోదించిన రూ.37,072 కోట్ల టెండర్ల పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపనున్న కేబినెట్. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15,081 కోట్ల పనులకు ఆమోదం తెలపనున్న కేబినెట్. 10 సంస్థల ద్వారా వచ్చే రూ.1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్.
రేపటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు – క్రీడా పోటీలకు 173 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు నమోదు.