ఎన్ హెచ్ ఆర్ సి సారంగాపూర్ మండల అధ్యక్షులుగా న్యారబోయిన వంశీకృష్ణ

ఎన్ హెచ్ ఆర్ సి సారంగాపూర్ మండల అధ్యక్షులుగా న్యారబోయిన వంశీకృష్ణ

నియామక ఉత్తర్వులు అందించిన జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ (జగిత్యాల జిల్లా): మార్చి ౦8 _జా తీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఆదేశాల మేరకు జిల్లాలోని సారంగాపూర్ మండల కమిటీ అధ్యక్షులుగా న్యారబోయిన వంశీకృష్ణను నియమించినట్లు జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చేకూట శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్ తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన సామాజిక ఉద్యమకారుడు వంశీకృష్ణను గుర్తించి ఈ పదవిని అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం రాష్ట్ర, జిల్లా కమిటీల ఆదేశాల మేరకు సంస్థ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. సారంగాపూర్ మండల అధ్యక్షులుగా నియమితులైన వంశీకృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజల పక్షాన ప్రశ్నించేగొంతుకగా నిజాయితిగా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కోల రాజేశం గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎనగందుల గణేష్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు గుగ్గిళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొని వంశీకృష్ణను అభినందించారు

  • Related Posts

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 18 :- నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్‌లో గల తుల్జాభవాని మాత ఆలయంలో ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు…

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్ ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్, ఫోటో గ్యాలరీ, సాంస్క్రతిక కార్యక్రమాలు ప్రభుత్వ హాస్టళ్ళలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలోయువ ఉత్సవ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

    పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

    పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం