ఇసుక అక్రమ రవాణా పై ఉక్కు పాదం: సీఎం రేవంత్ రెడ్డి!

ఇసుక అక్రమ రవాణా పై ఉక్కు పాదం: సీఎం రేవంత్ రెడ్డి!

మనోరంజని ప్రతినిధి

హైదరాబాద్:మార్చి 02
తెలంగాణలో ఇసుక అక్రమ రవాణను పూర్తిగా అరికట్టా లని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సరైన ధరలకు ఇసుకను సరఫరా చేస్తే.. వినియోగ దారులు అక్రమ రవాణాపై ఆధార పడరని అధికారు లకు సూచించారు.

హైదరాబాద్‌ నగరానికి మూడు వైపులా ఇసుక స్టాక్‌ పాయింట్లు సాధ్యమై నంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుకతో పాటు ఖనిజాల అక్రమ తవ్వకాలు, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. గ‌నుల శాఖ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు.

గ‌త నెల రోజులుగా తీసుకున్న చ‌ర్య‌ల‌తో ఇసుక అక్రమ ర‌వాణాకు అడ్డుక‌ట్ట ప‌డిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు సీఎంకు వివ‌రించారు. ఇసుక‌తో పాటు ఇత‌ర ఖ‌నిజాల అక్ర‌మ త‌వ్వ‌ కాలు, అక్ర‌మ స‌ర‌ఫ‌రాపై ఉక్కుపాదం మోపాల‌ని రేవంత్ రెడ్డి సూచించారు.

క‌ఠిన చ‌ర్య‌ల‌తోనే అక్ర‌మా ల‌ను అడ్డుకోగ‌ల‌మ‌ని, ప్ర‌భుత్వానికి ఆదాయం పెంచ‌గ‌ల‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఇసుక రీచ్‌ల్లో త‌వ్వ‌కాలు, ర‌వాణా, విని యోగ‌దారుల‌కు త‌క్కువ ధ‌ర‌కు ఇసుక స‌ర‌ఫ‌రాపై అధికారుల‌కు ముఖ్య‌మం త్రి ప‌లు సూచ‌న‌లు చేశారు.

అధికారులపై ప్రశ్నల వర్షం గ‌నుల శాఖ ప‌రిధిలోని వివిధ ఖ‌నిజాల క్వారీల‌కు గ‌తంలో విధించిన జ‌రిమా నాలు, వాటి వ‌సూళ్ల‌పైనా సీఎం అధికారుల‌ను ప్ర‌శ్నిం చారు. ఇందుకు సంబం ధించిన‌ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం త్వ‌ర‌గా తీసుకొని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ ని అధికారుల‌ను ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

దీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న మైన‌ర్ ఖ‌నిజాల బ్లాక్‌ల వేలానికి వెంట‌నే టెండ‌ర్లు పిల‌వాల‌ని సీఎం ఆదేశించారు. ప్ర‌భుత్వం లోని నీటి పారుద‌ల‌, ఆర్ అండ్ బీ, పంచాయ‌తీ రాజ్‌తో పాటు వివిధ శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో చేప్ట‌టే ప‌నుల‌కు టీజీఎండీసీ నుంచే ఇసుక స‌ర‌ఫ‌రా చేసేలా చూడాల‌న్నారు.

పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేప‌ట్టే నిర్మాణ రంగ సంస్థ‌ లకు అవ‌స‌ర‌మైన ఇసుక‌ను టీజీ ఎండీసీ ద్వారానే స‌ర‌ఫ‌రా చేయాల‌ని సీఎం ఆదేశించారు. స‌రైన ధ‌ర‌ల‌కు ప్ర‌భుత్వ‌మే ఇసుక స‌ర‌ఫ‌రా చేస్తే అక్ర‌మంగా స‌ర‌ఫ‌రా చేసే వారిపై విని యోగ‌దారులు ఆధార‌ప‌ డ‌ర‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు స‌మీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువ‌గా వినియోగం జ‌రుగుతోంద‌న్నారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష