ఇది కదా పోలీసుల పవర్..

ఇది కదా పోలీసుల పవర్..

నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

కత్తులు, కర్రలతో దాడి..

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వస్త్రల్ ఏరియాలో గత కొద్ది రోజుల నుంచి రౌడీలు రెచ్చిపోతున్నారు. హోలీకి ఒకరోజు ముందు మార్చి 13వ తేదీన 20 మంది రౌడీలు రోడ్డుపైకి వచ్చారు. వారి చేతుల్లో కత్తులు, కర్రలు ఉన్నాయి. రోడ్డు మీదకు వచ్చిన ఆ 20 మంది ఓ కారుపై దాడికి దిగారు. కారు ఓనర్‌ను దారుణంగా చితక్కొట్టారు. అంతటితో ఆగకుండా.. రోడ్డుపై వెళుతున్న మరికొన్ని వాహనాలపై కూడా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసు అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. సంఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. దర్యాప్తుకు ఆదేశించారు. పోలీసుల దర్యాప్తులో ఏం తేలిదంటే.. వస్త్రల్ ఏరియాలో ఓ ఫుడ్ స్టాల్ తెరిచే విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ మొదలైంది. పంకజ్ భవ్‌సార్ అనే వ్యక్తి సంగ్రమ్ సికార్‌వర్‌పై పగ పెంచుకున్నాడు. సంగ్రమ్‌ను ఫుడ్ స్టాల్ ఓపెన్ చేయనీయకుండా అడ్డుకున్నాడు.

రౌడీలకు చుక్కలు..

వాహనదారులపై కత్తులు, కర్రలతో దాడి చేసిన 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి తమదైన స్టైల్లో బుద్ధి చెప్పారు. 12 మందిని రోడ్డు మీద నడిపించి మరీ కొట్టారు. అది కూడా ఆ రౌడీలు నివసించే ప్రాంతంలో తిప్పుతూ చావకొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ అలాంటి వారికి అలా పోలీస్ స్టైల్‌లో బుద్ధి చెప్పాల్సిందే’..’ అన్ని రాష్ట్రాల్లో పోలీసులకు ఇలాంటి మద్ధతు లభిస్తే బాగుంటుంది. సమాజం బాగు పడుతుంది’..’ కొనసాగించండి.. పోలీస్ బెల్టులకు పని చెప్పాల్సిందే’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, కొంత మంది మాత్రం వడోదరాలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తున్నారు. మహిళను యాక్సిడెంట్ చేసి చంపిన వ్యక్తిని ఇంకా ఎందుకు శిక్షించలేదని ప్రశ్నిస్తున్నారు.

  • Related Posts

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత. ఒరిస్సా నుంచి ముంబాయికి 10 కేజీల గంజాయి అక్రమ రవాణా.. ఘట్కేసర్ లో స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు భవనేశ్వర్‌ నుంచి ముంబాయికి కోణార్క్‌ రైల్లో అక్రమంగా రవాణవుతున్న 10 కేజీల గంజాయిని సోమవారం హెచ్…

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు. విషయం బయటకు తెలుస్తుందనే భయంతో ఆ ఇద్దరు కలిసి భర్తను హత్య చేసి ఆకస్మికంగా మరణంగా చిత్రీకరించారు… తన పెదనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి