

ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం..
షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్..
ఫరూక్ నగర్ మండలం హాజిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన..
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు..
మంగళ హారతులతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన లబ్ధిదారులు
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల కృషి ఉందన్న ఎమ్మెల్యే..
ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీతోనే నిరుపేదలకు ఎంతో న్యాయం జరుగుతుందని, పేదలకు లబ్ధి చేకూరుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూక్ నగర్ మండలం హాజిపల్లి గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద సెలెక్ట్ చేసి ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో మంజూరైన 28 ఇండ్లకు సంబంధించి బుధవారం లాంచనంగా భూమి పూజ చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అసలైన నిరుపేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. గత పాలకులు 10 ఏళ్లలో ఎక్కడ కూడా నిరుపేదలకు ఇండ్లు కట్టించలేదని మాటలతో గొప్పలు చెప్పుకున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అసలైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు