ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

ఆశ వర్కర్స్‌పై అత్యాచార నిందితుడికి కఠిన శిక్ష విధించాలి – సీఐటీయూ

మనోరంజని ప్రతినిధి మల్కాజిగిరి మార్చి :- 13 మల్కాజిగిరి మండల కమిటీ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశ వర్కర్‌పై జరిగిన అత్యాచారం పై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సీఐటీయూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాయకులు, మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ. హేమలత మాట్లాడుతూ, నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి, ఎస్డీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టి కఠిన శిక్ష విధించాలని కోరారు.ఆశ వర్కర్స్‌పై పని భారం తగ్గించాలి, నైట్ డ్యూటీలు రద్దు చేయాలి, వర్కర్లకు రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ నిరసన ర్యాలీలో టి హేమలత, వసంత, కే. రాణి, భారతి, సురేఖ, మహిశ్వరి, స్వప్న, అనిత సహా అనేక మంది ఆశ వర్కర్స్ పాల్గొన్నారు

  • Related Posts

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    “రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు” సుప్రీం కోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు న్యూ ఢిల్లీ : సమాజం లో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో, కోర్టుల్లో, పలు కేసుల్లో,…

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలుహోలీ పండుగ సందర్భంగా భైంసా లోని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ నివాసంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. బ్యాండ్ మేళాలతో పలువురు కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం లోని ఆయా గ్రామాల నుండి వచ్చి ఎమ్మెల్యే కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు