

ఆశలు కాదు ఆశయాల కోసం జీవించాలి
మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 16 :- నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సౌన గ్రామానికి చెందిన స్వర్గీయ కేంశెట్టి బాబురావు పటేల్ తనకు చెందిన మూడు ఎకరాల 25 గుంటల వ్యవసాయ భూమిని బైంసా పట్టణంలోని వివేకానంద ఆవాసానికి దానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కృతజ్ఞత కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ… ఈ గొప్ప కార్యాన్ని మన ఆశలు జీవితాన్ని తగ్గించవచ్చు ఆశయాలు మనల్ని చిరంజీవుల్ని చేస్తాయి!! స్వల్పమైన సుఖాల కోసం, ఆశల కోసం అర్రులు చాస్తున్న ఈ కాలంలో ఉన్నతమైన విలువలు ఆశయాల కోసం కొందరు వ్యక్తులు జీవిస్తారు. జీవించడమే కాదు ఆచరించి చూపించి మార్గదర్శకులుగా నిలుస్తారని ఆకోవాకు చెందిన వారే భూదాత స్వర్గీయ బాబురావు పటేల్ అని వారి సేవలు ఎందరికో స్ఫూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సహా సంఘ్ చాలక్ సాదుల కృష్ణదాస్,వివేకానంద ఆవాస కమిటీ అధ్యక్ష,కార్యదర్శులు శైలేష్ మహశెట్టివార్,నారాయణ,సభ్యులు శ్యామ్ మందాని,నాగమణి లింగన్న,దామోదర్,వందన,అనిల్,రాజేశ్వర్,భోజన్న,రామకృష్ణగౌడ్,మహిపాల్,అరుణ్ రాజ్,నవీన్, దత్తురాం,లింగారెడ్డి,దేవేందర్,లక్ష్మణ్,బాలాజీ,మాధవ్,సుష్మిత రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
