ఆరోగ్య రక్షణకూ జాగ్రత్త తీసుకోవాలి

ఆరోగ్య రక్షణకూ జాగ్రత్త తీసుకోవాలి

నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీషర్మిల

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 28 – ప్రజల శాంతి భద్రతలు కాపాడటంలో మరియు నిరంతర ప్రజా క్షేమ కోసం పాటు పడటం లో జిల్లా పోలీసు లు బాధ్యతలు నిర్వహిస్తుంటారు. ఎండనక, వాననక నిరంతరం సొంత కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వక పోయిన గాని ప్రజల శాంతి భద్రతలు కోసం ఎల్లా వేళల బాధ్యతలు నిర్వహిస్తుంటే వారి ఆరోగ్యం పాడవుతుందని గ్రహించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల అరోగ్య భద్రత కోసం జిల్లాలో గల వైద్యధికారుతో మాట్లాడి స్వయంగా పర్యవేక్షిస్తూ జిల్లాలో పోలీసులకు ఉచితంగా మెడికల్ టెస్టు లు కోసం క్యాంప్ ను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో ఏర్పాటు చేసారు. ఇందులో భాగంగా ఎస్పీ స్వీయ పర్యవేక్షణ లో జిల్లాలోని 30 సంవత్సరాల వయస్సు పై బడిన 703 మంది పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించటం జరిగింది. వైద్య పరీక్షల రిపోర్టులు వచ్చిన తర్వాత సంబంధిత డాక్టర్ల కు చూపించి తగిన మందులు ఇప్పించటం జరిగింది. ఇట్టి పరీక్షలు మరియు వైద్యసేవలు ఒక నెల రోజులపాటు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో నిర్విరామంగా జరపటంలో విశేష కృషి చేసిన డాక్టర్లకు, ఆసుపత్రి ల్యాబ్ సిబ్బంది లకు , పొలీస్ సిబ్బందికి నిర్మల్ పొలీస్ ప్రధాన కార్యాలయం లో నిర్మల్ జిల్లా ఎస్పీ సన్మానించారు. వీరందరూ వీరి వీరి రోజు వారి బాధ్యతలకు ఆటంకం కలుగకుండా జిల్లా పోలీస్ సిబ్బంది కి వైద్య సేవలందించటం చాలా హర్షణీయం అని వీరిని జిల్లా ఎస్పీ ప్రశంసించారు. జిల్లా ప్రజల శాంతి భద్రత లు చూడటంలో పోలీస్ సిబ్బంది వారి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టలేరు , జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యాధికారులు నిర్మల్ జిల్లా పోలీస్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించినందుకు జిల్లా పొలీస్ ల తరుపున వీరందరికీ ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ సిబ్బంది వైద్య అధికారులు కలసి పని చేయాలని తెలియజేసారు. ఈ పరీక్షల అనంతరం సిబ్బంది వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని సిబ్బంది అంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కార్యక్రమం లో ఏ ఎస్ పి అవినాష్ కుమార్ , రాజేష్ మీన, ఏ.ఓ యూనస్ అలి, ఇన్స్పెక్టర్ లు గోవర్ధన్ రెడ్డి, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, కృష్ణ, సమ్మయ్య, ఆర్ ఐ లు రాం నిరంజన్, శేఖర్, రామకృష్ణ, రమేష్, ఎస్ఐ లు , ఆర్.ఎస్ఐ లు తదితర సిబ్బంది పాల్గొన్నారు

  • Related Posts

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO!

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO! కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలమైన ప్రపంచం మరో మహమ్మారికి సిద్ధం కావాలన్న డబ్ల్యూహెచ్ఓ 1918 నాటి ఫ్లూ వ్యాప్తికి 50 మిలియన్ల మంది మృతి ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొందని…

    చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలి…

    చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలి… తాడ్వాయి మండల ఎంఈఓ రామస్వామి.. మనోరంజని ప్రతినిధి కామారెడ్డి ఏప్రిల్ 08 :- తాడ్వాయి మండల కేంద్రంలో ఈ నెల 14వ తేదీ సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గిరిజన యువకుడు దారుణ హత్యగొడ్డలితో నరికి చంపిన దుండగులు

    గిరిజన యువకుడు దారుణ హత్యగొడ్డలితో నరికి చంపిన దుండగులు

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO!

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO!

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం

    కామారెడ్డి లో మరోసారి బట్టబయలైన కల్తీకల్లు బాగోతం

    కామారెడ్డి లో మరోసారి బట్టబయలైన కల్తీకల్లు బాగోతం