

అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 11 :- నిర్మల్ జిల్లా లక్ష్మణచందా- మామడ మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూమి పూజ, రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన నిర్వహించారు.లక్ష్మణ చందా పొట్టపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.అలాగే మామడ మండలంలో2 కోట్లతో చేపట్టిన బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి,బిజెపి నాయకులు వి. సత్యనారాయణ గౌడ్,వెంకటేశ్వరరావు, బాబురెడ్డి,రాజారెడ్డి,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు