

అనుమతి లేకుండా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 06 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీస్ సిబ్బంది పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముధోల్ సీఐ జి. మల్లేష్ మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పట్టుకున్న ఇసుకను రెవెన్యూ శాఖకు అప్పగించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అనుమతి లేకుండా నిలువ ఉంచిన ఇసుకను స్వాధీనం చేసి రెవిన్యూ అధికారులకు అప్పగించి వేలంపాట సైతం నిర్వహించారన్నారు. గ్రామాల్లో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. ఆయన వెంట ఎస్ఐ సంజీవ్ కుమార్, తదితరులున్నారు.